Friday, March 14, 2014

నా చివరి చిరునవ్వు


నీవు ఎంత దూరం ఉన్నా..
నా చెంత చేరకున్నా...

పంతమింక వీడనన్నా...
బదులు ఇంక ఇవ్వనన్నా...

మనసు కోరే మధుర తరుణం
యదను తాకే చివరి వరుణం
పలుకుతావని ఆశనిస్తూ...
మరలుతావని బుజ్జగిస్తూ...

ఎన్ని రోజులు ఎన్ని గంటలు
ఎంత సమయమైనా..!!
నీ బదులుకోసం 
మదిని చేరే నీ మనసుకోసం

నా తుదిశ్వాసని అడ్డుకుంటూ...
మలి ఆశని పెంచుకుంటూ...
నా చివరి చిరునవ్వు
నీ రూపాన్ని చూసి చిందులేయాలని ఆశిస్తూ...

నీకోసం నీవై నిండి ఎదురుచూసే
నీ ఈ చిన్ని ప్రేమికుడు...

-
చిన్నా